ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. వీడియో వైరల్
పురాణాల్లో బాణాన్ని బాణంతో కొట్టినట్లే, ఆధునిక యాంటీ-మిసైల్ సిస్టమ్స్ శత్రు క్షిపణులను గాలిలోనే అడ్డుకుంటున్నాయి. రాడార్ సాయంతో క్షిపణిని గుర్తించి.. అత్యంత వేగంతో క్షిపణిని ప్రయోగించి ఆకాశంలోనే పేల్చివేస్తారు. తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.