రాష్ట్ర స్థాయి మల్కంబ్‌లో జిల్లాకు 3వ స్థానం

రాష్ట్ర స్థాయి మల్కంబ్‌లో జిల్లాకు 3వ స్థానం

NZB: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మల్కంబ్ పోటీలలో NZB జిల్లా అండర్- 17 బాలికల ఛాంపియన్‌షిప్‌లో 3వ స్థానం దక్కించుకుంది. బుధవారం నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో జరిగిన ఈ పోటీలలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు బాలికలు ఆయా కేటగిరీలలో మెడల్స్ సాధించారు. దీంతో ఛాంపియన్‌షిప్‌లో 3వ స్థానం దక్కింది.