రేపు ఢిల్లీలో లోకేష్ పర్యటన

రేపు ఢిల్లీలో లోకేష్ పర్యటన

AP: మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పార్లమెంట్ హౌస్‌లో రేపు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న ఆయన.. విద్య, ఐటీ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. రేపు రాత్రికి అక్కడే బస చేసి, ఎల్లుండి ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు వెళ్లనున్నారు. 16న విశాఖలో జరిగే GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రానికి అమరావతికి తిరిగివస్తారు.