'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

SRPT: రేపు జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నడిగూడెం ఎస్సై అజయ్ ఇవాళ కోరారు. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్నీ కేసుల్లో కక్షిదారులు రాజీ పడవచ్చన్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి రాజీ మార్గమే రాజ మార్గమని తెలిపారు. ఇందుకు లోక్ అదాలత్ ఓ మంచి వేదిక అని మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.