ఆ గ్రామంలో సర్పంచ్, 6 వార్డు స్థానాలు ఏకగ్రీవం

ఆ గ్రామంలో సర్పంచ్, 6 వార్డు స్థానాలు ఏకగ్రీవం

ADB: గాదిగూడ మండలంలోని బాబేఝరీ గ్రామంలో సర్పంచ్, 6 వార్డు స్థానాలను గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎన్నుకున్నారు. ఈ మేరకు ఇవాళ గ్రామ సభ నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్‌గా కొడప దుర్గు, ఉపసర్పంచి జాంబ్లే బాబు, వార్డు సభ్యులుగా కృష్ణ, గంగు, బాబు, మారుతీ, ఆనందరావు మోతుబాయిలను నిర్ణయించారు. గ్రామాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.