సంస్కృతి కళాశాలలో ఐడీఈ బూట్ క్యాంప్
సత్యసాయి: పుట్టపర్తి సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏప్రిల్ 6 - 10 వరకు ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ నిర్వహించనున్నారు. కేంద్ర టెక్నికల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నూతన ఆవిష్కరణలు, డిజైనింగ్ మెలుకువలు, వ్యాపార అవకాశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు.