VIDEO: 'భవన నిర్మాణ కార్మికుల హామీలు నెరవేర్చాలి'
KRNL: భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు నరసింహులు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డు పథకాలు నిలిపివేస్తూ ఇచ్చిన 1214 జీవోను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని వారు కోరారు.