ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. కర్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. రైతులు న్యాయమైన ధరకే ధాన్యం అమ్మే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతన్నారు.