ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
KMR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని చెప్పారు. ఈ గడువు తర్వాత చెల్లించేవారు ఆలస్య రుసుముతో ఫీజుచెల్లించవలసి ఉంటుందని ఆయన సూచించారు.