అలర్ట్.. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

అలర్ట్.. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

NLR: సీతారామపురం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీహరి తెలిపారు. కుర్రపల్లి, సీతారామపురం విద్యుత్తు ఉపకేంద్రాల మధ్య లైన్ల మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఏఈ తెలిపారు.