మునసలపాలెంలో అనారోగ్యంతో విద్యార్థి మృతి
ASR: వై. రామవరం మండలం మునసలపాలెం గ్రామానికి చెందిన బి.సాయికుమార్ రెడ్డి (8) అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం ఇంటివద్దే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. వెదురునగరం పాఠశాలలో 3వ తరగతి చదువుతూ, ఓ హాస్టల్లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా జ్వరం, పచ్చకామెర్లుతో బాధ పడుతుండడంతో ఇంటికి తీసుకొచ్చి వైద్యం అందజేస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.