'SSMB29' టైటిల్ లాంచ్ ఈవెంట్.. హోస్ట్‌లు వీళ్లే!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకడు రాజమౌళి కాంబోలో రాబోతున్న 'SSMB29' సినిమా ఈవెంట్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈనెల 15న ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ భారీ కార్యక్రమాన్ని యూట్యూబర్, కమెడియన్ ఆశిష్ చంచలానీ, ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల కలిసి హోస్ట్ చేయనున్నారు. దీంతో ఈవెంట్‌కు మరింత గ్లామర్ రానుంది.