చిరుత సంచారం కలకలం

చిరుత సంచారం కలకలం

NGKL: కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కోడేరు మండలం నర్సాయపల్లి-మైలారం రోడ్డులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. రైతులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ రేంజర్ కాశన్న ఆధ్వర్యంలో అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి కాళ్లజాడలను పరిశీలించి చిరుతదేనని నిర్ధారించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.