లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ
ASF: రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ కోరారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో త్వరగా పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమని తెలిపారు. "రాజీ మార్గమే రాజ మార్గం" అని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.