తల్లి మృతి.. అనాథలైన ముగ్గురు పిల్లలు

KRNL: పత్తికొండ మండలం చందోలి గ్రామంలో విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మి (33) కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఆమెకు ముగ్గురు సంతానం. భర్త అంజయ్య రెండేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి అన్నీ తానై పిల్లలను పోషిస్తుండగా ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. ఆదివారం లక్ష్మి గుండెపోటుతో మరణించింది. తల్లి మృతితో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.