సిమెంటు ట్యాంకర్ బోల్తా

సిమెంటు ట్యాంకర్ బోల్తా

KDP: చుండూరు మండలం మల్యాల గ్రామ సమీపంలో గురువారం సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎర్రగుంట్ల నుంచి బెంగళూరుకు సిమెంట్ తరలిస్తున్న లారీ మలుపు వద్ద అతివేగంగా వెళ్లడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా పడింది. వెంటనే స్థానికులు గాయపడిన డ్రైవర్ను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.