VIDEO: రైతులను ఆదుకోవాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
SRPT: సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ సాయంత్రం పర్యటించిన విషయం తెలిసందే. పర్యటనలో భాగంగా చివ్వేంల మండలంలోని వట్టి ఖమ్మంపాడులో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుఫాన్ ప్రభావం వల్ల రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. నీట మునిగిన పంట పొలాల రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.