గుంతల మయంగా మారిన దన్నూర్ రోడ్డు

KMR: జిల్లా మధ్నూర్ మండలంలోని ధన్నూర్ గ్రామ రోడ్డు పలుచోట్ల గుంతల మయంగా మారింది. ధన్నూర్ గ్రామం నుంచి పెద్ద ఎక్లరా గ్రామం వరకు వెళ్లే రోడ్డు పలుచోట్ల అద్వానంగా తయారయింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిని సైతం బాగు చేసి ప్రమాదాలను నివారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.