పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తండ్రి

మేడ్చల్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. కూకట్ పల్లిలోని ఓ గెస్ట్ హౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు కొండలరావుతో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.5 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.