'దళారుల మోసాల బారిన పడకూడదు'
NRML: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్వింటాలుకు రూ. 2400 కనీస మద్దతు ధరతో రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకుని లబ్ధి పొందాలన్నారు. దళారుల మోసాల బారిన పడకూడదని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.