ఎన్నికలు.. బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం
బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లియాండర్ మాట్లాడుతూ.. దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు చెప్పారు. క్రీడలు, యువత అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. క్రీడా రంగంలో అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయన్నారు.