VIDEO: మరో రేషన్ బియ్యం లారీ పట్టివేత
MDK: అక్రమంగా తరలిస్తున్న మరో రేషన్ బియ్యం లారీని శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు తూప్రాన్ ఎస్సై శివానందం తెలిపారు. హైదరాబాద్ నుంచి సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుజరాత్ తరలిస్తున్నారు. సమాచారం రావడంతో తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో పట్టుకున్నట్లు వివరించారు. లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.