దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి: అదనపు కలెక్టర్

దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి: అదనపు కలెక్టర్

ADB: దివ్యాంగుల్లో లోపాలను ఎత్తి చూపకుండా వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందించాలని అదనపు కలెక్టర్ శ్యామల దేవి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు.