రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య:  ములకలచెరువు మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంజునాథ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పనిమీద బురకాయలకోటకు వెళ్తుండగా, పెద్దపాళ్యం గేటు వద్ద అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న జింకను ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. స్థానికులు వెంటనే అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం మంజునాథ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది.