జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!
గుంటూరు: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 7,34,672 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 3,54,330 మంది ఉండగా, మహిళలు 3,80,306 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 36 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది.