పాలిసెట్ ప్రవేశాలు.. ఏప్రిల్ 20 వరకు ఛాన్స్

పాలిసెట్ ప్రవేశాలు.. ఏప్రిల్ 20 వరకు ఛాన్స్

MDK: జహీరాబాద్ మండలం రంజోల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం పదవ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గుప్త తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తిగల విద్యార్థులు tspolycet.nic.in వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.