వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
BDK: కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని రక్షించారు. పట్టణంలోని సురక్షా బస్టాండ్ సమీపంలో జాఫర్ అనే వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అనంతరం 100కు ఫోన్ చేసి చెప్పాడు. మణుగూరు బ్లూకోట్ పోలీసులు జాఫర్ను గుర్తించి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు పోకుండా కాపాడారు. పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.