ఎంజేపీలో ప్రవేశాలకు దరఖాస్తులు

ఎంజేపీలో ప్రవేశాలకు దరఖాస్తులు

HNK: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు రీజనల్ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు నేరుగా సంబంధిత డిగ్రీ కళాశాలలో సంప్రదించి ప్రవేశాలను పొందవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.