గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ

MHBD: జిల్లాలో రేపు జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ భద్రత చర్యలను చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఎన్నికల కోసం ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 50 ఎస్సైలు మొత్తం 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.