తండ్రిని చంపిన కొడుకు

కృష్ణా: పెనమలూరు(M) తాడిగడప శ్రీనివాసనగర్‌లో మానవత్వాన్ని కలిచివేసిన దారుణం చోటుచేసుకుంది. పెయింటింగ్ పనికి వెంట రాలేదనే చిన్న కారణంతో కుమారుడు కేశవరావు తన తండ్రి నన్నం శౌరిని అమానుషంగా కొట్టి ప్రాణం తీశాడు. రోడ్డు మీద పడేసి, గేటుకేసి గుద్దడంతోపాటు ఇంట్లో కూడా దారుణంగా దాడి చేయగా, శౌరి నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.