శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు
AP: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్దం చేశారు. ఈనెల 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాదికి వారం రోజుల ముందు నుంచే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకుంటారు. అయితే, ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు.