'మంగళగిరి-తాడేపల్లికి మెగా డ్రైనేజీ ప్రాజెక్ట్'
GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలో 513 కిలోమీటర్ల మేర రూ.1167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏ నిధులతో రెండు దశల్లో ఈ పనులు జరుగుతాయని, మంత్రివర్గ ఆమోదం వెంటనే టెండర్లు పిలుస్తామని ఆయన అధికారులతో జరిగిన సమీక్షలో వెల్లడించారు.