VIDEO: కొయ్యూరులో కుండపోత వర్షం
ASR: కొయ్యూరు మండలంలో కుండపోత వర్షం కురుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. కాగా, మండలంలో గత 3రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆధికారులు కోరుతున్నారు. అయితే, కనిష్ఠంగా 12 నుంచి గరిష్ఠంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.