పబ్లిక్ స్కూల్స్ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. 800 నుంచి 1000 మంది విద్యార్థులకు సరిపడా G+1 పద్ధతిలో అదనపు తరగతి గదులు, ల్యాబ్స్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గదిలో గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేయాలని తెలిపారు.