ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రఖ్యాత సాంకేతిక విద్యాసంస్థ IIT హైదరాబాద్ పరిశోధనల పట్ల ఆసక్తి గల వారి కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్ కింద చేపట్టిన ఈ రెండు నెలల ప్రోగ్రామ్‌కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇప్పటికే ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10వ తేదీ వరకు కొనసాగనుంది.