ప్రభుత్వ వైద్యులు తీరు మారడం లేదని ఆవేదన
కోనసీమ: ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ తీసుకువచ్చినా ప్రభుత్వ వైద్యులు తీరు మారడం లేదని ప్రజలు అంటున్నారు. అమలాపురం మండలం బండారులంక పీహెచ్సీలో వైద్యులు మొక్కుబడి విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం విధులకు రావలసిన డెంటిస్ట్ కారులో వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి వెంటనే వెళ్లిపోయాడని ఆరోపిస్తున్నారు. దీంతో రోగులు అసహనం వ్యక్తం చేశారు.