ఆలయాల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఆలయాల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక పూజలు

ATP: పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెన్నా నది ఒడ్డున వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి, రాజ రాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించారు.