నార్లాపూర్-పులిమామిడి రహదారిలో నిలిచిన కెనాల్ పనులు

నార్లాపూర్-పులిమామిడి రహదారిలో నిలిచిన కెనాల్ పనులు

మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్-పులిమామిడి రహదారిలో కొండ పోచమ్మ కెనాల్ పనులు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి అడ్డంగా గుంతలు ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.