VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్, ఎస్పీ

ADB: పట్టణంలో భారీ వర్షం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలోని స్థానిక మణిపూర్ కాలనీలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సహాయ చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని శనివారం పరిశీలించారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు పూర్తిగా సహాయ చర్యలో నిమగ్నం అవ్వాలని ఆదేశించారు.