రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
ASR: రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అబ్దుల్ అనే యువకుడు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. రాజవొమ్మంగి శివారులో ద్విచక్రవాహనం టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.