కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్

TG: మాజీమంత్రి KTR వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలియజేశారు. సీఎం, మంత్రులు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు KTR అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నిమిషం పరిస్థితిని అధికారుల ద్వారా సీఎం ఆరా తీస్తున్నారని తెలిపారు.