'విచారణలో నాణ్యతే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలి'
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో స్టేషన్ రైటర్లు, సర్కిల్, డీఎస్పీ ఆఫీస్ రైటర్లతో ఎస్పీ రాజేష్ చంద్ర ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తు, విచారణ పరిశోధనలో నాణ్యతా ప్రమాణాలు కీలకమని, ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జీషీట్ వరకు అన్ని వివరాలు స్పష్టంగా, సమగ్రంగా, తప్పులు లేకుండా నమోదు చేయడం ప్రతి రైటర్ బాధ్యత అని ఆయన సూచించారు.