నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
SKLM: ఆమదాలవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎస్. రామ్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, గ్రామ సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.