గంజాయి, బహిరంగ మందుపై కఠిన చర్యలు
కడప పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం కడప నగరంలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీలు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.