VIDEO: జగన్నాథుడి సేవలో నాగచైతన్య, శోభిత
టాలీవుడ్ దంపతులు నాగచైతన్య, శోభిత ప్రముఖ ఆలయంలో పూజలు చేశారు. ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ జంట స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు వారికి పూజారులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగచైతన్య 'వృషకర్మ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.