మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై

ప్రకాశం: మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని హెచ్చరించారు. శుక్రవారం వెలిగండ్లలో వాహన తనిఖీలు నిర్వహించి మైనర్లు నడుపుతున్న ద్విచక్ర వాహనలను స్వాధీనం చేసుకున్నారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.