కోతులను తరిమేందుకు వినూత్నంగా యత్నించిన విద్యార్థులు
NLG: అడ్డగూడూరు(M) కోటమర్తి MPP పాఠశాల విద్యార్థులు నిత్యం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో కోతులు విరుచుకుపడుతూ.. దాడులు చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విద్యార్థులు ఇవాళ చింపాంజీ, సింహం ఆకారంలో ఉన్న మాస్కులు ధరించి, కోతులను తరిమేందుకు వినూత్నంగా యత్నించారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.