పాఠశాల భవనం కావాలి: విద్యార్థులు

పాఠశాల భవనం కావాలి: విద్యార్థులు

అల్లూరి: డంబ్రిగుడ మండలం పరిధిలోని కితలంగి పంచాయతీ దేవలం గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాల భవనం లేక ఓ ఇంట్లో తమకు పాఠాలు చెబుతున్నారని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం శాశ్వత పాఠశాల భవనం మంజూరు చేయాలని కోరారు.