ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
KRNL: ఆస్పరిలో స్థానిక ఆటో స్టాండ్ వద్ద AITUC 106వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి జండా ఆవిష్కరణ చేశారు. ప్రజలకు సరైన పాలన అందించే విషయంలో పాలకులపై నిరంతరంగా పోరాడేది కేవలం కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమంతు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.