టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

PPM: పార్వతీపుం మండలం ఎం.ఆర్.నగర్ కు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఉరిటి సూరినాయుడు, మచ్చ జగ్గునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర టీడీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.